సిక్సులు, ఫోర్లతో ధోని భయపెట్టాడు

virat kohli, dhoni
virat kohli, dhoni


బెంగళూరు: చివరి ఓవర్‌లో ధోని సిక్సులు, ఫోర్లతో భయపెట్టాడని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఆదివారం చిన్నస్వామి మైదానం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు నెగ్గింది.
162 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఐతే ఆ జట్టు సారథి ధోని 84(48 బంతుల్లో 5ఫోర్లు, 7 సిక్సులు) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఓవరులో 26 పరుగులు అవసరం కాగా ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న ధోని వరుస బౌండరీలతో విజృంభించాడు. ఆ ఓవర్‌లో మొత్తం 24 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి 2 పరుగులు అవసరం పరుగు తీసే సమయంలో అవతలి ఎండ్‌లో ఉన్న శార్ధూల్‌ ఠాకూర్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో బెంగళూరు జట్టు సారథి విరాట్‌ కోహ్లి చెన్నై కెప్టెన్‌ ధోనిని ప్రశంసల్లో ముంచెత్తాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/