టీడీపీ నుంచి చాలామంది టచ్ లో

MP CM Ramesh
MP CM Ramesh

Amaravati: బీజేపీ గూటికి చేరిన ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులలో ఒకరైన సీఎం రమేష్ మాట్లాడుతూ తమ పార్టీ మార్పులో చంద్రబాబు హస్తముందన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. చంద్రబాబే మమ్మల్ని బీజేపీలోకి పంపించారని గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలను రమేష్ తప్పుపట్టారు. ప్రచారం చేసే వారు అందుకు తగిన ఆధారాలు చూపించగలరా? అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు ఎందుకు బీజేపీలోకి వెళ్లమని ప్రోత్సహిస్తారని ప్రశ్నించిన అయన టీడీపీ నుంచి తనతో చాలామంది టచ్ లో ఉన్నారని త్వరలో మరికొంతమంది తమ పార్టీలో చేరనున్నారని చెప్పారు.