యూపీలో మ‌‌రో వాంటెడ్ క్రిమిన‌ల్ హ‌తం

అతడి తలపై లక్ష రూపాయల రివార్డు

Wanted criminal Tinku Kapala killed in encounter by Uttar Pradesh

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో క్రిమినల్స్ కోసం వేట కొనసాగుతోంది. మూడు వారాల క్రితం గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే మ‌ట్టుబెట్టిన పోలీసులు, ఈ రోజు మ‌రో వాంటెడ్ క్ర‌మిన‌ల్ టింకూ క‌పాలా ప‌నిప‌ట్టారు. శ‌నివారం తెల్ల‌వారుజామున బారాబంకి ప్రాంతంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో క‌పాలా హ‌త‌మ‌య్యాడు. స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో టింకూ తీవ్రంగాగాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. టింకూ తలపై లక్ష రూపాయల రివార్డు ఉన్నట్టు ఎస్పీ అరవింద్ చతుర్వేది తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/