సోమవారమే రంజాన్‌..

లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లలోనే ఈద్‌ ప్రార్థనలు

Ramadan moon

New Delhi: దేశంలో ఈద్‌-ఉల్‌-ఫితర్‌(రంజాన్‌) పర్వదినాన్ని సోమవారం జరుపుకోవాలని ఢిల్లీ జామామసీదు షాహీ ఇమామ్‌ అహ్మద్‌ షా బుకారీ, హైదరాబాద్‌లోని రూహియత్‌ ఇలాల్‌ కమిటీ అధ్యక్షుడు అజీముద్దీన్‌ ప్రకటించారు.

శనివారం ఢిల్లీ తో పాటు దేశంలో మరే ప్రాంతంలోనూ నెలవంక కనిపించలేదని, ఆదివారం రాత్రి రంజాన్‌ మాసం పూర్తి కావడంతో కనిపిస్తుందన్నారు.

లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఇళ్లలోనే ఈద్‌ ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. 

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/