వైఎస్‌ఆర్‌సిపిలోకి మోహన్‌బాబు?

mohan babu
mohan babu, actor


హైదరాబాద్‌: సినీనటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబు వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్నారని సమాచారం. లోటస్‌పాండ్‌లో ఆ పార్టీ అధినేత జగన్‌ను ఆయన మంగళవారం కలవనున్నారు. దీంతో ఆయన వైఎస్‌ఆర్‌సిపిలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో ఇటీవలే అధికార టిడిపి ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వైఎస్‌ఆర్‌సిపిలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది.