రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ క్యాబినేట్‌

వెల్లడించిన కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌

cabinate meeting
cabinate meeting

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు జరిగిన క్యాబినేట్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ అంశాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాకు వెల్లడించారు. ఇందులో మొదటిదది.. ఏడాది పాటు ఎంపిల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్‌లో 30 శాతం కోత విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 1954 చట్టాన్ని సవరించింది. ఇక రెండవది.. ఎంపిలాడ్స్‌ను రెండు సంవత్సరాల పాటు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిలాడ్స్‌ ద్వారా వచ్చే రూ.7,900 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ఒక సామాజిక భాధ్యతగా భావిస్తు , వేతనాల్లో కోతకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు స్వచ్చందగా ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/