వంద మంది కార్యదర్శులతో ప్రధాని భేటి

narendra modi
narendra modi

న్యూఢిల్లీ: ఈ రోజు సాయంత్రం ప్రధాని మోది అన్ని ప్రధాన శాఖల కార్యదర్శులు, ప్రధాన మంత్రిత్వ శాఖల మంత్రులతో సమావేశం కానున్నారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను కార్యదర్శులకు వివరించడంతోపాటు వారి దగ్గరి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ను సైతం మోది తీసుకుంటారని అంటున్నారు. ఈ సమావేశంలో దాదాపు 100 మంది అధికారులు పాల్గొంటున్నారు.
ఈ సమావేశం నేటి సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభమవుతుందని, ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీతో పాటు అడిషనల్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, కేబినెట్‌ కార్యదర్శి తదితరులు పాల్గొంటున్నారు. ఐతే ఇలాంటి సమావేశాలు కొత్తేం కాదని, ఇంతకు పూర్వం కూడా మోది ఇలాంటి సమావేశాలు నిర్వహించి అధికారులతో చర్చించే వారని పిఎంవో వర్గాలు తెలిపాయి.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/