టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజ్‌పై మోది ఫోటో

modi
modi

న్యూయార్క్‌: భారత్‌లోని సార్వత్రిక ఎన్నికలు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే అమెరికాకు చెందిన వీక్లీ టైమ్‌ మ్యాగజైన్‌ కూడా ఈ సారి భారత ఎన్నికలపై ప్రత్యేక కథనాన్ని రూపొందించింది. దీంతో పాటు ప్రధాని మోది ఫోటోను కవర్‌పేజ్‌పై ప్రచురించింది.
మే 20, 2019న వెలువడే టైమ్‌ మ్యాగజైన్‌ యూరప్‌, ఆసియా, మధ్య ప్రాశ్చ్యం, దక్షిణ పసిఫిక్‌ అంతర్జాతీయ ఎడిషన్లలో మోది కవర్‌స్టోరి ప్రచురించింది. ఫోటో పక్కన ”ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌” అనే వివాదాస్పద హెడ్డింగ్‌ను పెట్టింది. దీంతో పాటు ”మోది ది రిఫార్మర్‌” అనే మరో హెడ్‌లైన్‌ కూడా ఇచ్చింది. ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌ కథనాన్ని భారత జర్నలిస్టు ఆతిష్‌ తసీర్‌ రచించారు. మరో కథనం మోది ది రిఫార్మర్‌ను ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ యురేసియా గ్రూప్‌ వ్యవస్థాపకుడు ఇయాన్‌ బ్రెమర్‌ రాశారు. మ్యాగజైన్‌ లోపల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరో ఐదేళ్లు మోది ప్రభుత్వం వస్తుందా అనే పేరుతో తసీర్‌ కథనం రాశారు.
ఇందులో మోది ప్రవేశపెట్టిన పథకాలు, జిఎస్‌టి, ఆధార్‌ వినియోగం వంటి అంశాలను ప్రస్తావించారు. బలహీనమైన ప్రతిపక్షం ఉండటం మోది అదృష్టమని రచయిత పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/