ఒకే వేదికపై ప్రధాని మోడి, మమతా బెనర్జీ!

కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవాలకు మోడి, మమత

Modi, Mamata Banerjee
Modi, Mamata Banerjee

కోల్‌కతా: . పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వార్షికోత్సవాల సందర్భంగా రేపు ఓ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి హాజరు కావాల్సి ఉంది. అలాగే, ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా పాల్గొంటారని తెలిసింది. అయితే ఈనేపథ్యంలో ఒకే వేదికపై మోడి, మమతా బెనర్జీ కనపడనున్నారు. నేడు, రేపు ప్రధాని మోడి.. పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తారు. పోర్టు ట్రస్ట్ కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారని ఇప్పటికే ప్రకటన వెలువడింది. పోర్టు వార్షికోత్సవాలకు మమత బెనర్జీని కూడా ఆహ్వానించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల పట్టిక, జాతీయ జనాభా పట్టిక వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై మమత బెనర్జీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ, మమత ఒకే వేదికపై కనిపిస్తారా? అనే ఆసక్తి నెలకొంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/