వనదుర్గ మాతకు పట్టువస్త్రాలు

ఏడుపాయలు శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

minister-harish-rao
minister-harish-rao

ఏడుపాయలు: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఏడుపాయలు శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా వనదుర్గ మాతకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఏడుపాయలకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో అన్నింటికీ అన్యాయం జరిగినట్టుగానే దేవాలయాలకు అన్యాయం జరిగిందని అన్నారు. వచ్చే శివరాత్రి నాటికి కాళేశ్వరం నీళ్లు మెదక్ జిల్లాకు వస్తాయని అన్నారు. కాగా సిఎం కెసిఆర్‌ కాళేశ్వరం పనులను యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారని వివరించారు. ఈ ప్రాంత రైతులకు కాళేశ్వరం నీళ్ల ద్వారా రెండు పంటలు పండిస్తామని హరీశ్ రావు అన్నారు. సిఎం రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. దేవాదాయ శాఖను బలోపేతం చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు. ఏడుపాయలకు ఏడాదంతా భక్తులు వస్తుంటారని హరీశ్ రావు తెలిపారు. ఏడుపాయలకు వచ్చే భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించే విదంగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. కాగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ,ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి ,మదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి,ఈఓ సారా శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/