బొగ్గు గనిలో ప్రమాదం, 21 మంది మృతి

coal mine accident
coal mine accident


బీజింగ్‌: చైనాలోని ఓ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. గని పై కప్పు కూలి కనీసం 21 మంది మృత్యువాత పడ్డారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య చైనాలోని జిలిన్‌ ప్రావిన్స్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి కుదుపులు సంభవించడంతో పైకప్పు కూలి అనేక మంది గనిలోనే చిక్కుకున్నారు. ఈ క్రమంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా..మరో పది మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం గని జిలిన్‌ లాంగ్‌జియాబావో మైనింగ్‌ కార్పొరేషన్‌ యాజమాన్య పరిధిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/