మైక్‌ పాంపియోతో ప్రధాని మోడి సమావేశం

ఉగ్రవాదం, హెచ్‌ 1బి వీసా ఒప్పందంపై చర్చ

Mike Pampeo, modi
Mike Pampeo, modi

న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో భారత్‌ విచ్చేశారు. నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ తొలుత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్‌..తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో వరుసగా భేటి అవుతారు. వీరి మధ్య రష్యాతో క్షిపణి ఒప్పందం, హెచ్‌ 1 బీ వీసా గురించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రష్యా నుంచి 400 క్షిపణులు కొనుగోలు, ఉగ్రవాదం, వాణిజ్యం గురించి కూడా డిస్కషన్‌ చేసే ఛాన్స్‌ ఉంది.
సరిహద్దులో ఉగ్రవాదం, జాతీయ భద్రత గురించి సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ ప్రస్తావిస్తారు. ఈ మేరకు విదేశాంగ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే వారం జి 20 సభ్యదేశాల సమావేశం ఉంది. ఐతే మైక్‌ పారపియో చర్చించిని అంశాల గురించి ట్రంప్‌, మోది చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. రష్యా నుంచి ఎస్‌ 400 క్షిపణుల కొనుగోలును అమెరికా వ్యతిరేకిస్తుంది.
ఈ సమావేశంలో హెచ్‌ 1 బి వీసా నిబంధలను సడలించాలని అమెరికాను కోరనుంది. దీనిపై అమెరికా వైఖరి స్పష్టం చేయాలని మోడి, జై శంకర్‌ ప్రధాన డిమాండ్‌ అని విశ్వసనీయ వర్గాల తెలిసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/