సముద్రంలో బోటు బోల్తా, 65 మంది మృతి

sank the boat in ocean
sank the boat in ocean


మధ్యధరా సముద్రంలో బోటు బోల్తాపడింది. టునిషియా తీరం దగ్గర బోటు బోల్తా పడిన ఘటనలో సుమారు 65 మంది శరణార్ధులు చనిపోయారు. ఈ విషయాన్ని యూఎస్‌ రెఫ్యూజి ఏజెన్సీ వెల్లడించింది. బోటులో ప్రయాణిస్తున్న మరో 16 మందిని రక్షించినట్లు యూఎన్‌ ఓ ప్రకటనలో తెలియజేసింది. లిబియాలోని జువారా నుంచి బోటు బయల్దేరినట్లు బోటులో ప్రయాణించిన వారు చెప్పారు. బలమైన అలలు ఒక్కసారిగా రావడంతో బోటు బోల్తా పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే లిబియా నుంచి యూరప్‌ మధ్యఉన్న జలమార్గంలో సుమారు 164 మంది చనిపోయినట్లు యూఎన్‌ సంస్థ వెల్లడించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/