ఛోక్సి ఆంటిగ్వా పౌర‌స‌త్వం ర‌ద్దు!

mohul choksi
mohul choksi

ఆంటిగ్వాః పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అతడి పౌరసత్వాన్ని ఉపహరించుకోవాలని ఆంటిగ్వా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే అందుకు కారణం. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో దేశం విడిచిపారిపోయి ఛోక్సి ప్రస్తుతం ఈ కరీబియన్‌ దీవుల్లో నివసిస్తున్నాడు. మార్చి నుంచి భారత్ ప్రభుత్వం అతడిని తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించింది. 

పౌరసత్వం ఉపసంహరణపై ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్‌ మాట్లాడుతూ..‘ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తులకు ఈ దేశం సురక్షితమైన ప్రదేశం కాదు’ అని వెల్లడించారు. ‘ఛోక్సి పౌరసత్వాన్ని పరిశీలించాం.  అతడి పౌరసత్వాన్ని రద్దు చేసి, భారత్‌కు పంపిస్తాం. అలాగే దీనిపై కోర్టుకు వెళ్లే హక్కు ఛోక్సికి ఉంది. న్యాయపరంగా అన్ని అవకాశాలు ముగిసిన తరవాత అతడిని స్వదేశానికి పంపిస్తామని భారత ప్రభుత్వానికి వెల్లడించాం’ అని బ్రౌన్‌ స్పష్టం చేశారు. 

తాజా జాతీయ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/