అయోధ్య పరిష్కారంపై ఆగస్టు 15 వరకు గడువు

supreem court
supreem court

న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై నేడు విచారణ జరిపిన సుప్రీం సమస్య సామరస్య పరిష్కారానికి గానూ మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు మరింత గడువు ఇచ్చింది. ఈ వ్యవహారంలో మధ్యంతర నివేదికను కమిటీ ఇటీవల న్యాయస్థానానికి సమర్పించిన విషయం అందరికీ తెలిసిందే. సమస్య సామరస్యంగా, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు తమకు మరికొంత సమయం కావాలని కమిటీ కోర్టును కోరింది. ఇందుకు గాను సిజెఐ రంజన్‌ గగో§్‌ు నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అయోధ్య పరిష్కారం ఆగస్టు 15 వరకు గడువు కల్పించింది.
మధ్యవర్తిత్వ కమిటీ కార్యకలాపాలన్నీ రహస్యమైనవని, బహిర్గతం చేయబోమని, కమిటీ కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోరాదని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలకు ఏమైనా అభ్యంతరాలుంటే జూన్‌ 30లోగా వాటిని కమిటీ ముందుకు తీసుకువచ్చేందుకు అనుమతినిచ్చింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/