ఒకే వేదికపై ములాయం, మాయావతి

akhilesh, mayawati, mulayam
akhilesh, mayawati, mulayam

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఒకప్పటి బద్ధ శత్రువులు ములాయం సింగ్‌ యాదవ్‌, మాయావతి ఇవాళ ఒకే వేదికపై కనిపించి అద్భుతాన్ని సృష్టించారు. దాదాపు పాతికేళ్ల వైరాన్ని పక్కనపెట్టి దేశ భవిష్యత్‌ కోసం సమజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు చేతులు కలిపాయి. బిజెపిని గద్దె దించడమే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ఈ పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బిఎస్పీ, ఆర్‌ఎల్డీ, కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. మొయిన్‌పురి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాయావతి, ములాయం పాల్గొన్నారు. ఇక మాయావతికి ఎడమవైపున అఖిలేఫ్‌ యాదవ్‌, కుడివైపున ములాయం సింగ్‌ కూర్చున్నారు. సభా వేదికపై నుంచి ఈ నేతలు ప్రజలకు అభివాదం చేసిన సమయంలో చప్పట్లు మార్మోగాయి. ఈ సభకు ఆర్‌ఎల్డీ అధినేత అజిత్‌ సింత్‌ హాజరు కాలేదు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/