వచ్చే నెల 3న బీఎస్పీ నాయకులతో మాయావతి సమావేశం

mayawati
mayawati, bsp president

లక్నో: బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బిఎస్పీ) అధినేత్రి మాయావతి జూన్‌ 3వ తేదీన తమ పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన 10 మంది ఎంపీలు, మిగతా అభ్యర్ధులు, నియోజకవర్గ ఇంఛార్జీలు. జిల్లా అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఓటమికి గల కారణాలపై లోతుగా విశ్లేషించనున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం బీఎస్పీ నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పి-బిఎస్పి-ఆర్‌ఎల్డీ పొత్తు పెట్టుకుని ఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించింది. ఆర్‌ఎల్డీ మూడు స్థానాల్లో పోటీ చేసినప్పటికి ఏ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. భారతీయ జనతా పార్టీ మొత్తం 62 స్థానాల్లో గెలిచింది. యూపి లోక్‌సభ స్థానాలు 80.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/