మారిషన్‌ అధ్యక్షుడికి విమానాశ్రయంలో చేదు అనుభవం

లగేజీ ఎక్కువైందని కారణంతో అధ్యక్షుడిని ఆపారు

Mauritius-president-stopped-at-Varanasi-airport
Mauritius-president-stopped-at-Varanasi-airport

వారణాసి: మారిషన్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌ సింగ్‌, మరో ఆరుగురు ప్రతినిధులతో కలిసి వారణాసికి వచ్చారు. రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్తండగా ..వారణాసిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా సిబ్బంది వీరిని అడ్డుకున్నారు. అధ్యక్షుడి బృందం లగేజీ పరిమితికి మించి ఉండటంతో అదనపు చార్జీలు చెల్లించమని అడిగారు. అయితే ఈ విషయం కాస్తా ఉన్నాతాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే వారు కలుగజేసుకుని ఎయిరిండియా సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అనంతరం పృథ్వీరాజ్‌ బృందం ఢిల్లీ బయలుదేరింది. ఈ ఘటనను ఎయిర్‌పోర్టు అక్షదీప్‌ మాథుర్‌ ధ్రువీకరించారు. మారిషన్‌ అధ్యక్షుడిని అడ్డుకున్నారని తెలిసిన వెంటనే తాను జోక్యం చేసుకున్నానని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కూడా స్పందించి ఎయిరిండియా సిబ్బందితో మాట్లాడారన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/