అజర్‌ బతికే ఉన్నాడు: పాక్‌ మీడియా

masood azhar
masood azhar

లాహోర్‌: ఉగ్రవాది, జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ ఆజర్‌ ఆదివారం మరణించినట్లు ప్రచారం కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఆజర్‌ బతికే ఉన్నాడని పాకిస్థాన్‌ మీడియా వెల్లడించింది. దీంతో అజర్‌ కుటుంబానికి సన్నిహితులైన వారిని వివరణ కోరగా.. మసూద్‌ బతికే ఉన్నాడని చెప్పినట్లు జియో ఉర్దూ న్యూస్‌ వెల్లడించింది. అయితే అజర్‌ మృతి చెందాడా? లేక బతికే ఉన్నాడా? అనే విషయంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.