మసూద్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడు: పాక్‌

masood azhar
masood azhar

ఇస్లామాబాద్‌: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది ప్రాణలను బలికి తామే కారణమని జైషే ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాక భారత్‌లో పలు ఉగ్రదాడుల సూత్రదారి, జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు ఆ దేశం అంగీకరించింది. పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మసూద్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడా? అని అడిగిన ప్రశ్నకు ఖురేషి బదులిస్తూ..ఖఖఅతడు (మసూద్‌) పాక్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటిని విడిచి బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నాడు అని తెలిపారు.మసూద్‌ను పాక్‌ అరెస్ట్‌ చేయాలంటే.. ముందుగా భారత్‌ మాకు సరైన ఆధారాలు అందించాలి. అవి పాక్‌ న్యాయస్థానాలకు ఆమోదయోగ్యం కావాలిగగ అని ఖురేషి చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. భారత్‌ వద్ద తగిన ఆధారాలు ఉంటే.. దయచేసి కూర్చుని చర్చించుకుందాం. చర్చలను ప్రారంభించండి. మేం సంసిద్ధంగా ఉన్నాం అని ఖురేషి పేర్కొన్నారు.