తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

mansoon effect
mansoon effect

రాష్ట్రంలో విస్తరించిన నైరుతి రుతుపవనాలకు తోడుగా వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి వాతావరణం పంటల సాగుకు పూర్తి అనుకూలంగా మారుతుందని అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌ తీరంలో 3.1 నుంచి 7.56 కిలోమీటర్ల మధ్య ఉపరితర ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఫలితంగా తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం కొనసాగుతుందని హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.