నామినేషన్‌ వేసిన అఖిలేష్‌, మేనకా గాంధీ

akhilesh yadav
akhilesh yadav


లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంఘడ్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి ఆజంఘడ్‌ కంచుకోటగా ఉంది. మే 12న ఎన్నికలు జరగనున్నాయి. ముస్లిం మెజార్టీ ఎక్కువగా ఉండడం తనకు కలిసి వస్తుందని అఖిలేష్‌ ఆజంఘడ్‌ను ఎంపిక చేసుకున్నారు.ములాయం మొయిన్‌పురి నుంచి బరిలో ఉన్నారు.
కేంద్ర మంత్రి మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. మేనకాగాంధీ కూడా ఇవాళే తన నామినేషన్‌ను దాఖలు చేశారు

maneka gandhi
maneka gandhi

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/