ఆసుపత్రుల వద్ద సెక్యూరిటీ పెంపు

Mamata Banerjee
Mamata Banerjee


కోల్‌కత్తా: బెంగాల్‌లో నిరసన చేపడుతున్న జూనియర్‌ డాక్టర్లతో నేడు సియం మమతాబెనర్జీ సమావేశం అయ్యారు. సచివాలయంలో ఆమె డాక్టర్ల బృందాన్ని కలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్‌కు చెందిన ఇద్దరు సంబంధీకులకు అనుమతి ఇవ్వాలని దీదీ డాక్టర్లకు సూచించినట్లు తెలుస్తుంది. ఎమర్జెన్నీ డిపార్ట్‌మెంట్‌ల వద్ద కొత్త తరహా బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో పీఆర్వోలు ఉంటారన్నారు. ఇవాళ సమావేశంలో 31 మంది డాక్టర్లు పాల్గొన్నారు. ఆ రాష్ట్ర హెల్త్‌ సెక్రటరీ చంద్రిమా భట్టాచార్య కూడా సమావేశానికి హాజరయ్యారు. డ్యూటీ డాక్టర్‌పై దాడి జరిగిన కేసులో ఐదుగుర్ని అరెస్టు చేసినట్లు సియం మమతా బెనర్జీ వెల్లడించారు. రాత్రి పూట హాస్పిటళ్ల వద్ద సెక్యూరిటీని పెంచనున్నట్లు ఆమె తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/