దీదీ రాక్షస వంశానికి చెందినవారు!

మమతాపై సాక్షి మహరాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

sakshi maharaj, mamata banerjee
sakshi maharaj, mamata banerjee

హరిద్వార్‌: బిజెపి, తృణమూల్‌ నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతుంది. తాజాగా బిజెపి ఉన్నావో ఎంపి సాక్షి మహరాజ్‌…పశ్చిమబెంగాల్‌ సియం మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్‌ అంటే తప్పేంటని, అలా అన్న వారిపై దీదీ ఆగ్రహిస్తున్నారని, ఆమె రాక్షస వంశానికి చెందిన హిరణ్యకశిపుని కుటుంబానికి చెందిన వారని సాక్షి మహరాజ్‌ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలతో బిజెపి, తృణమూల్‌ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దీదీ వెళ్తున్న కాన్వా§్‌ుకి కొంతమంది బిజెపి కార్యకర్తలు అడ్డుపడ్డారు. అంతటితో ఆగకుండా జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తూ ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కారు దిగి వారిని హెచ్చరించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/