రోహిత్‌ శర్మ కాలుకు గాయం

rohit sharma
rohit sharma


ముంబై: ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సారథి, టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మకు గాయం అయింది. బుధవారం ఎలెవన్‌ పంజాబ్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం రోహిత్‌ సాధనలో భాగంగా మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తూ డైవ్‌ చేశాడు. ఆ సమయంలో కుడికాలు కండరాలు పట్టేయడంతో నొప్పితో గ్రౌండ్‌లోనే విలవిల్లాడాడు. జట్టు వైద్యుడు నితిన్‌ పటేల్‌ వచ్చి రోహిత్‌ను మైదానం నుంచి తీసుకెళ్లాడు. రోహిత్‌ గాయం గురించి ఆ జట్టు యాజమాన్యం ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు నుంచి ఆరు వారాల విశ్రాంతి అవసరమవుతుందని తెలిసింది. ఐతే ప్రపంచకప్‌లోపు రోహిత్‌ కోలుకుంటాడని ముంబై ఇండియన్స్‌ జట్టు ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/