‘ప్రియతమా ప్రియతమా’ లిరికల్ సాంగ్

Samanta , Chaitu in Majili Movie
Samanta , Chaitu in Majili Movie

నాగచైతన్య – సమంతాలు జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’.   ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  ఇప్పటికే ‘వన్ బాయ్ వన్ గర్ల్’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన ‘మజిలీ’ టీమ్ ఆదివారం సాయంత్రం ఇదు గంటలకు ‘ప్రియతమా ప్రియతమా’ అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.
చైతు.. సామ్ ల పై సాగే ఈ పాటకు రిలీజ్ టైం తెలిపేందుకు ఒక పోస్టర్ విడుదల చేసింది ‘మజిలీ’ టీమ్.  ఈ పోస్టర్లో చైతు.. సమంతాలు ఇద్దరూ ఆర్టీసీ బస్సు ఫుట్ బోర్డ్ పై నిలబడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు.  ఇద్దరి లుక్ చాలా యంగ్ గా ఉంది.. ఓ పదేళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా ఉన్నారు.  చైతు క్లీన్ షేవ్ తో స్లిమ్ లుక్ లో ఉండగా సామ్ కాలేజి యూనిఫామ్ లో చైతు కంటే స్లిమ్ గా.. అమాయకంగా మొహం పెట్టింది.  ఇప్పటివరకూ రిలీజ్ అయిన ‘మజిలీ’ పోస్టర్లలో చైతు – సామ్ ఇద్దరూ భార్యాభర్తలుగా డిఫరెంట్ లుక్ లో కనిపించారు కానీ ఈ పోస్టర్ వాటికి పూర్తి భిన్నంగా ఉంది.  ఈ పోస్టర్ ‘మజిలీ’ పై ఆసక్తి మరింత పెంచేలా ఉంది.