వెంకన్నను దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు

maithripala sirisena
maithripala sirisena, srilanka president


తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన తన కుటుంబ సమేతంగా తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీవారి దర్శనానికి వెంట ఉండి తీసుకెళ్లారు.
రంగనాయకుల మండపంలో వేదపండితులు మైత్రిపాల దంపతులకు వేదాశీర్వచనాలు అందించి, తీర్ధ ప్రసాదాలను అందించారు. ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, జేఈఓ శ్రీనివాసరాజులు శ్రీ పద్మావతి సమేత శ్రీవారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను దంపతులకు అందించారు. ఈ సాయంత్రం వారు రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/