తెలంగాణ‌లో కింగ్ మేక‌ర్‌

                                   తెలంగాణ‌లో కింగ్ మేక‌ర్‌

MAHANADU
MAHANADU

2019 తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతాం
తెలంగాణలో కర్ణాటక సీన్‌ రిపీట్‌!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక భూమికి పోషిస్తాం!
నాకు ప్రధాని కావాలనే ఆశ లేదు..తెలుగు జాతి అబివృద్దినే లక్ష్యం..
తిరుపతి వెంకన్న ప్రాణబిక్ష పెట్టారు..ఆయన్ను రాజకీయాల్లో లాగడం సరైందికాదు..ఇదంతా బిజెపి ఆడించే నాటకం!
వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలవటం దేశంలో చారిత్రక అవసరం
తెలంగాణ మహానాడులో చంద్రబాబునాయుడు
హైదరాబాద్‌: 2019 ఎన్నికల్లో తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతామని టిడిపి జాతీయ అధ్యక్షులు, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో టిడిపి కీలక భూమిని పోషిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కర్ణాటక సీన్‌ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో మార్పు వస్తుందన్నారు. జాతీయ రాజకీయాల్లో టిడిపి కీలకపాత్ర పోషిస్తుందని చంద్రబాబు తెలిపారు. టిడిపినికాదని ఎవరూ ఎమీ చేయలేరనాన్రు. 1996లో తృతీయ కూటమి ఏర్పాటు చేసి దేవేగౌడను ప్రధాని చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్‌, బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుచేసిన ఘనత టిడిపిదేనన్నాను. తనకు ప్రధాని పదవి అవసరం లేదని, 20 ఏళ్ల క్రితమే చెప్పానన్నారు. ప్రధానిమంత్రి అయ్యే అవకాశం రెండుసార్లు వచ్చినప్పటికీ వద్దని చెప్పానన్నారు. ప్రధాని పదవి కంటే తెలుగు జాతి, ప్రజలకు సేవా చేయడమే తనకు మఖ్యమని ఆయన వెల్లడించారు ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నానంటే..పదవుల కోసం కాదని, ప్రజా సేవ కోసమేనన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
టిడిపి-టిఎస్‌ మహానాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ అధ్యక్షతన గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. తొలుత ఎన్టీఆర్‌ సమాధి వద్ద రమణ నేతృత్వంలోని పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎం.ఎన్‌. శ్రీనివాస్‌, బిఎన్‌.రెడ్డి తదితరులు నివాళులర్పించారు. అనంతరం మహానాడు ప్రాంగణానికి చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఇటీవల ప్రమాదశాత్తు మరణించిన రాజునాయక్‌కు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి పార్టీ నుండి రూ.2 లక్షల సాయం చేస్తున్నట్లు రమణ ప్రకటించారు. తర్వాత 8 తీర్మానాలపై పలువురు నాయకులు చర్చించి ఆమోదించారు.
అనంతరం ఈ మహానాడుకు ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ 14 ఏళ్లు అధికారంలో లేకున్న జెండా మోస్తున్న కార్యకర్తలకు పేరుపేరునా అభినందనలు తెలుపున్నానన్నారు. ఎన్నో ఇబ్బందులెదురైనా, నక్సలైట్లు, రాజకీయ ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన నాయకుల కుటుంబాలు కూడా పార్టీకి అండగా ఉన్నాయన్నారు. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించిన మినీ మహానాడులకు అధిక సంఖ్యలో హాజరైన కార్యకర్తల ఉత్సహం చూస్తుంటే 2019 ఎన్నికల్లో టిడిపి రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఖాయమనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన కార్యకర్తలంతా పార్టీ వెంటే నడిచారని చంద్రబాబు కొనియాడారు. తెలంగాణలో టిడిపి తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం ఏశారు. అందుకు ఈ 6 నెలలు కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి పార్టీ అభివృద్ది..విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌ నగర అభివృద్దిలో టిడిపి ఎంతో కృషి ఉందన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో తాగునీరు లేని పరిస్థితి ఉండేదని, ఈరోజు మహానగరం మారిందంటే టిడిపి చేసిన కృషినే అందుకు కారణమన్నారు. దేశంలోనే నెంబర్‌ 1గా పేరొందిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం టిడిపి హయాంలో నెలకొల్పిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రమంతటా రోడ్లను వెడల్పు చేశామన్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల అబిశృద్ది జరుగుతుందంటే గతంలో తాము చేసిన కృషి ఫలితంగానేనన్నారు. భావితరాల భవిష్యత్‌ కోసమే హైటెక్‌ సిటి నిర్మించామని, విద్యకు ప్రాధాన్యం ఇచ్చి సైబరాబాద్‌ నగరానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. హైదరాబాద్‌ను అభివృద్ది చేసేందుకు ప్రపంచమంతా తిరిగానన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 8లైన్ల అవుటర్‌ రింగ్‌రోడ్డును నిర్మించామన్నారు. ఐటికి ప్రాధన్యమిచి హైటెక్‌ సిటీ నిర్మించామని..ప్రపంచమంతా తిరిగి మైక్రోసాప్ట్‌ లాంటి ఎన్నో కంపెనీలను హైదరాబాద్‌కు తెచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. 9 నెలల్లో కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తాగునీటికి అందించామన్నారు. రాష్ట్రంలో పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది ఎన్టీఆర్‌నేనని, టిడిపి పార్టీ తెలంగాణ గడ్డపైనే పుట్టిందని గుర్తు చేశారు. టిడిపి ప్రభుత్వంలో చేసిన అభివృద్ది వల్ల ఇప్పుడు వస్తున్న జీఎస్టీ ఆదాయంలో ఏపి కంటే తెలంగాణలోనే ఆదాయం ఎక్కువగా వస్తుందని..అందులో కూడా హైదాబాద్‌ నుండే సింహభాగం వస్తుందని చంద్రబాబు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకుండా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుజాతికి న్యాయం జరగాలనే ఇటీవల కర్ణాటకు వెళ్లానన్నారు. రాష్ట్రానికి న్యాయం కోసం అందరినీ కూడగట్టి ధర్మపోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు. తెలంగాణలో టిడిపిని కాపాడుకుంటానని ఆయన తెలిపారు. టిడిపి శ్రేణులు ఏడాదిపాటు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే అంకితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులు తమ స్వార్థ కోసం పార్టీని వీడినా..కార్యకర్తలు వెళ్లలేదని, అది తనపై వారికునక్న నమ్మకమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లు కష్టపడ్డా..ఇంకో ఏడాది పార్టీ కోసం కష్టపడుతామని ఆయన కార్యకర్తలను కోరారు.
తనకు ప్రాణబిక్ష పెట్టింది తిరుమల వెంకటేశ్వరస్వామియేనన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకుని బ్రహ్మోత్సవాలకు వెళ్తుంటే..నక్సలైట్లు 21 క్లైమోర్‌ మైన్స్‌ పేల్చి తనను చంపాలని చూశారని, అయితే వెంకటేశ్వరస్వామి దయవల్ల ప్రాణాపాయం నుండి బయటపడ్డానని ఆయన గుర్తు చేశారు. స్వామివారి అభరణాలు తన వద్ద ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని దీన్ని సహించనన్నారు. గతంలో వెంకటేశ్వరస్వామితో పెట్టుకున్న వారి గతి ఏమైందో అందరికీ తెలుసునన్నారు. తాను వెంకటేశ్వరస్వామి పాదపద్మముల చెంత పుట్టి పెరిగానని, ఆయనకు అప్రతిష్ట తెచ్చే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని చంద్రబాబు స్పష్టం చేశారు. చివరకు దేవ దేవున్ని కూడా రాజకీయ లబ్ది కోసం వివాదం చేయడం సరైంది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదంతా బిజెపి ఆడించే నాటకమని ఆయన ఆరోపించారు.
కేంద్రం తెలుగు రాష్ట్రాలకు నమ్మక ద్రోహం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. గత ఎన్నికల్లో తనతో పొత్తు పెట్టుకొని తెలంగాణ, ఏపిల్లో కొన్ని స్థానాల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రాగానే మొదట ఏకపక్షంగా తెలంగాణలో పొత్తులేదని బిజెపి ప్రకటిచిందన్నారు. అప్పుడు వారి దుర్బిద్ది బయటపడిందని తర్వాత కొంత సమయం తీసుకుని ఏపిలో కూడా విభజన హామీలను నెరవేర్చకుండా టిడిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేసిందన్నారు. 29 మార్లు తాను ఢిల్లీకి వెళ్లి విజభన హామీలను నెరవేర్చాలని ప్రధాని కలిస్తే ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అలాగే తెలంగాణలో బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, గిరిజన విశ్వవిద్యాలయం, నిధుల సాయం లాంటివేమీ నెరవేర్చలేదని ఆయన గుర్తు చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రమే కోట్లాది నిధులు ఇచ్చిందన్నారు. మరోపక్క డిమానిటేషన్‌తో మనడబ్బులను మనం తీసుకునేది లేకుండా కేంద్రం చేసిందన్నారు. బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఎటిఎం, బ్యాంకుల్లో దబ్బుల్లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. జిఎస్టీ సరిగ్గా అమలు కావటం లేదని, ఒక పద్దతి ప్రకారం స్లాబుల్లేవని విమర్శించారు. ఇదంతా అన్యాయమని టిడిపి పార్లమెంటులో ప్రశ్నించిందన్నారు. రైతులకు న్యాయం చేయాలని వారి ఆదాయం రెట్టింపు చేయాలనే బిజెపి హామీలను నెరవేర్చాలని నిలదీశామని చంద్రబాబు వెల్లడించారు.