శ్రీనగర్‌లో భూకంపం..3.6 తీవ్రత

Richter scale graph
Earthquake

శ్రీనగర్‌: జ‌మ్ముకశ్మీర్‌లో మ‌రోమారు భూకంపం సంభ‌వించింది. మంగ‌ళ‌వారం రాత్రి 9.40 గంట‌ల‌కు శ్రీన‌గ‌ర్‌, బుద్గాం, గందేర్బ‌ల్ స‌హా ప‌‌రిస‌ర జిల్లాల్లో భూమి కంపించింది. దీని తీవ్ర‌త 3.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్‌ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. శ్రీన‌గ‌ర్ స‌మీపంలో భూఅంత‌ర్భాగంలో 5 కి.మీ. లోతులు భూమి కంపించించిద‌ని తెలిపింది. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెంది, ఇళ్ల నుంచి వీధుల్లోకి పరిగెత్తారు. రాత్రంతా వీధుల్లోనే గడిపారు.’ఇది చాలా భయాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరూ క్షేమంగానే ఉన్నారని అనుకుంటున్నాను’ అని శ్రీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ షాహీద్ చౌధురి తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఇక తాము ఎదుర్కొన్న పరిస్థితి గురించి పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఆస్తి నష్టం కూడా సంభవించిందని తెలుస్తుండగా, ప్రాణనష్టంపై మాత్రం సమాచారం అందలేదు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/