మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

16 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాకు స్పీకర్ ఆమోదం!

Kamalnath
Kamalnath

బెంగళూరు: మధ్యద్రేశ్‌లో కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి ఈరోజు సాయంత్రం 5గంటల లోపు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహంచాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సందర్భంగా కమల్‌నాథ్‌ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యెలు సమర్పించిన రాజీనామాలను స్పీకర్‌ ప్రజాపతి ఆమోదించారు. ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేలందరూ బెంగళూరులోని ఓ హోటల్‌లో ఉన్నారు. బెంగళూరులో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు 16 మంది రాజీనామాలను ఆమోదించినట్టు తాజాగా స్పీకర్ తెలిపారు. న్యాయవ్యవస్థ మార్గదర్శకాలను అసెంబ్లీ పాటిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో ఆ పార్టీ బలం ఇప్పుడు 104కు పెరిగింది. అదే సమయంలో బిజెపి బలం 107గా ఉండడంతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపికి మార్గం సుగమమైంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/