ధోని అనుభవం టీమ్‌కు కీలకం

దినేశ్‌ కార్తీక్‌ అనుభవం ఎంతో ఉపయోగం

MS dhoni, virat kohli
MS dhoni, virat kohli

ముంబై: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనిని విమర్శించే వారిపై టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మండిపడ్డాడు. వికెట్‌ కీపర్‌గా ధోని అందించిన సేవలు వెలకట్టలేనివని, అతని అనుభవం ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలకం కానుందని చెప్పాడు. విరాట్‌ మొదటిసారిగా ప్రపంచకప్‌లో భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ధోని జట్టులో ఉండడం వల్ల తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నాడు. దీనిపై కోహ్లి మాట్లాడుతూ.. తన క్రికెట్‌ కెరీర్‌ మొదలైంది ధోని సారథ్యంలోనేనని, ధోని జట్టులో ఉండడం ఎంతో ముఖ్యమని, అతడు గేమ్‌ ఛేంజర్‌, ఎన్నో కీలక సమయాల్లో స్టంప్స్‌ వెనక వికెట్లను తీశాడు. జట్టులో ప్రతి ఒక్కరూ రాణించాలంటే ధోని సలహాలు, సూచనలు ఎంతో అవసరం అని తెలిపాడు.
ప్రపంచకప్‌లో రిషబ్‌పంత్‌కు బదులు దినేశ్‌కార్తీక్‌ను ఎంచుకోవడంపై కోహ్లి స్పందించాడు. మ్యాచ్‌లో జట్టు ఒత్తిడిని ఎదుర్కొనేటప్పుడు దినేశ్‌ కార్తీక్‌ అనుభవం ఎంతో ఉపయోగం. దినేశ్‌ ఎన్నోసార్లు మ్యాచ్‌ను గట్టెక్కించాడు. ఫినిషర్‌గానూ దినేశ్‌ అద్భుతం అని పేర్కొన్నాడు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos