మెక్సికోలో స్మగ్లర్ల తెలివి తేటలు

డ్రగ్స్, ఖనిజాల స్మగ్లింగ్ కోసం భూగర్భ మార్గం, రైలు ట్రాక్ ఏర్పాటు

smuggling tunnel
smuggling tunnel

మెక్సికో: మెక్సికోలోని స్మగ్లర్లు భూమికి 21 మీటర్ల లోతున ఏకంగా ఓ సొరంగ మార్గమే ఏర్పాటుచేసి అవసరమైన రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా ఈ మార్గంలో డ్రగ్స్, ఇతర విలువైన ఖనిజాల రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. వీరి అక్రమ వ్యవహారాన్ని అక్కడి పోలీసులు ఎట్టకేలకు పసిగట్టి బ్రేక్ వేశారు. అయితే స్మగ్లర్ల తెలివి తేటలు చూసి నోరెళ్లబెట్టారు. కాగా మెక్సికోలో తిజౌనా నుంచి శాండియాగో వరకు దాదాపు కిలోమీటరు పొడవున భూగర్భంలో ఉన్న ఓ రవాణా మార్గాన్ని అక్కడి భద్రతా సిబ్బంది కనుగొన్నారు. సొరంగంలో సరకుల రవాణాకు వీలుగా రైలుమార్గం, విద్యుత్ సదుపాయం , ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు చేశారు. తొలుత ఇదేదో సైన్యం తమ అవసరాల కోసం నిర్మించిందని అనుకున్నారు. కాదు స్మగ్లర్లు తమ అక్రమ రవాణా కోసం నిర్మించిందని తేలడంతో అధికారులు కళ్లు తేలేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం గుట్టుమట్ల పై ఆరాతీస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/