మలేషియా బ్యాడ్మింటన్‌ స్టార్‌ రిటైర్మెంట్‌ ప్రకటన

Lee Chong Wei
Lee Chong Wei, badminton player

కౌలాలంపూర్‌: బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌, మాజీ నెంబర్‌ వన్‌, మలేషియాకు చెందిన లీ చాంగ్‌ వూ..ఇవాళ రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. 19 ఏళ్ల తన అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు కన్నీటి పర్యంతం అవుతూ రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. 36 ఏళ్ల లీ చాంగ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య వైద్యులను కలిసిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వరుసగా మూడు ఒలంపిక్స్‌లో లీ చాంగఖ సిల్వర్‌ మెడల్స్‌ సాధించాడు. ఆ తర్వాత మూడు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లోనూ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. లండన్‌, గాంగ్‌జూ, జకార్తాలో జరిగిన వరల్డ్‌ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/