కేంద్ర కేబినెట్‌లో స్థానంలేని బుందేల్‌ఖండ్‌!

bundelkhand
bundelkhand

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఇతర స్థానాల్లో ఎంపిలకు ప్రాతినిధ్యం లభించిన విధంగా వెనుకబడిన ప్రాంతం అయిన బుందేల్‌ఖండ్‌ప్రాంతానికి మాత్రం కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం లభించలేదు. బుందేల్‌ఖండ్‌ప్రాంతం యుపికి సంబంధించి అత్యంత వెనుకబడినప్రాంతంగా చెపుతారు. మొత్తం నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. నాలుగింటిలోను బిజెపి అభ్యర్ధులే గెలుపొందారు. బాందాలో బిజెపి ఆర్‌కెసింగ్‌పటేల్‌ సమాజ్‌వాదిపార్టీకి చెందిన శ్యామచరణ్‌గుప్తాను 58 వేల ఓట్ల తేడాతో ఓడించారు.

హమిర్‌పూర్‌లో కున్వర్‌పుష్ఫేంద్రసింగ్‌ చందేల్‌ బిజెపి అభ్యర్ధిగా గెలుపొందారు. ప్రత్యర్ధి దిలీప్‌కుమార్‌సింగ్‌ బిఎస్‌పినుంచి పోటీ చేసినా 2.48 లక్షల ఓట్ల తేడాతో బిజెపి గెలిచింది. ఇక ఝాన్సి స్థానంలో అనురాగ్‌ శర్మ బిజెపి అభ్యర్ధిగా 3.65 లక్షల ఓట్లతేడాతో గెలుపొందారు. జలౌన్‌స్థానంలో భానుప్రతాప్‌సింగ్‌ వరమ్మ బిజెపి అభ్యర్ధిగా బిఎస్‌పి కి చెందిన అజ§్‌ుసింగ్‌ను 1.58 లక్షల ఓట్లతేడాతో ఓడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి స్టార్‌ నేత ఉమాభారతి ఝాన్సినుంచి గెలుపొంది కేబినెట్‌లోప్రాతినిధ్యం వహించారు.

బుందేల్‌ఖండ్‌ప్రాంతం ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొండప్రాంతంగా ఉంటుంది. యుపిలోని ఏడు జిల్లాలు బాందా, మహబోబా, హమిర్‌పూర్‌, లలిత్‌పూర్‌, ఝాన్సి, జలౌన్‌, చిత్రకూట్‌ జిల్లాలుంటే మధ్యప్రదేశ్‌లోనిఎనిమిది జిల్లాలు ఈ ప్రాంతం కిందికి వస్తున్నాయి.అయితే పూర్తి వెనుక బడిన ప్రాంతంపై బిజెపి నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రతి ఎన్నికల్లోను బిజెపి అభ్యర్ధులనే గెలిపిస్తున్నప్పటికీ తమ ప్రాంతం అభివృద్ధికి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ కూడా పట్టించుకోవడంలేదని ఆ ప్రాంత ఓటర్లు ప్రజలు కేంద్ర రాష్ట్ర కమలనాధులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/