సిక్సర్ల మోత మోగించిన రసెల్‌

andre russell
andre russell


బెంగళూరు: శుక్రవారం జరిగిన ఐపిఎల్‌ మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించి కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు రసెల్‌ విజయాన్ని అందించాడు. 13 బంతుల్లో 48 పరుగులు చేసి కోహ్లి జట్టు ఖాతా తెరవనీయకుండా అడ్డుకున్నాడు. దీంతో రసెల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సీనియర్‌ క్రికెటర్లు సైతం ఈయన గారి వీర బాదుడి పట్ల అభినందనలు కురిపిస్తున్నారు.
దీనిపై రసెల్‌ మాట్లాడుతూ..తాను బ్యాటింగ్‌ బరిలోకి దిగేటప్పుడు నమ్మకంగానే ఉన్నాను. పిచ్‌ను బట్టి నడుచుకోమని దినేశ్‌ కార్తీక్‌ సలహా ఇచ్చాడు. 20 బంతుల్లో 68 పరుగులు చేయాలని అర్ధమైంది. తీవ్ర ఒత్తిడిలో ఎలా కొట్టానో నాకే తెలీదు. జట్టులో ప్రతి ఒక్కరూ తనను సపోర్టు చేస్తారని, కాబట్టే తాను ఏకాగ్రతతో ఆడగలుగుతున్నానని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/