మా కుటుంబంపై ఆరోపణలు సమంజసం కాదు

Kodela Siva Prasad
Kodela Siva Prasad

Amaravati: మాకుటుంబంపై ఆరోపణలు సమంజసం కాదని ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలకు కోడెల వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలపై దాడులను ఖండిస్తున్నామన్నారు. తాము అభివృద్ధిపై దృష్టిపెట్టాం తప్ప.. దాడులపై కాదని అన్నారు. స్పీకర్ గా తాను నిష్పక్షపాతం పనిచేశానన్నారు. టీడీపీ కార్యకర్తలు గ్రామాలు విడిచివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలీసులు రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. తన కుటుంబంపై అనేక కేసులు పెడుతున్నారన్నారు.