రష్యాకు కిమ్ శుభాకాంక్ష‌లు

రెండో ప్ర‌పంచ యుద్ధంలో మిత్ర‌రాజ్యాల విజ‌యానికి గుర్తుగా 75వ వార్షికోత్స‌వం జరుపుకుంటున్న రష్యా

Kim Jong Un- Vladimir Putin

సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కిమ్‌ జోంగ్ ఉన్ లేఖ రాశారు. రెండో ప్ర‌పంచ యుద్ధంలో మిత్ర‌రాజ్యాల విజ‌యానికి గుర్తుగా 75వ వార్షికోత్స‌వం జరుపుకుంటున్న సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇప్పుడు క‌రోనా వైర‌స్‌పై ర‌ష్యా విజ‌యం సాధించాల‌ని కిమ్‌ ఆకాంక్షించారు. వైరస్‌పై విజ‌యం సాధించి శ‌క్తిమంత‌మైన ర‌ష్యాను నిర్మించ‌డానికి అక్క‌డి ప్ర‌జ‌లు చేస్తున్న యుద్ధంలో గెలవాలని కోరుకుంటున్న‌ట్లు కిమ్‌ లేఖలో పేర్కొన్నారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/