జిమ్ము ..జిల్ జిల్ భామ

Kiera Adwani from Gym
Kiera Adwani from Gym

కియారా అద్వాని మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’.. చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చిత్రాలలో నటించడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది.  ఈ భామ ప్రస్తుతం హిందీలో ఊపిరిసలపనంత బిజీగా ఉంది.  అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎక్సర్ సైజులు చెయ్యడం మాత్రం మానదు.  జిమ్ముకు దూరంగా ఉండదు.
ఈమధ్య కియారా అద్వాని బాక్సింగ్ ట్రైనింగ్  తీసుకుంటోందట. ముంబైలో సదరు బాక్సింగ్ క్లాసుకు వెళ్తూ ఉంటే ఫోటోగ్రాఫర్ లు క్లిక్కుమనిపించారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.  కియారా స్టైల్ సంగతి అందరికీ తెలిసిందే.  ఫ్యాషన్ ఈవెంట్ అయినా.. సినిమా ఫంక్షన్ అయినా.. పార్టీ అయినా.. జిమ్ అయినా ఆయా సందర్భానికి తగ్గ దుస్తులు ధరించి తన ఫ్యాషన్ సెన్స్ తో చూపరులను క్లీన్ బౌల్డ్ చేస్తుంది.  బాక్సింగ్ క్లాసుకు వెళ్తున్నప్పుడు కూడా అదే తరహాలో తన డ్రెస్సును ధరించింది.  కాల్విన్ క్లెయిన్ వారి స్లీవ్ లెస్ టాప్.  ఆ టాప్ లో ఒక్క సెంటిమీటర్ కూడా వదలకుండా కాల్విన్ క్లెయిన్.. కాల్విన్ క్లెయిన్ అని రాసి ఉంది. ఇక ఆ టాప్ కు సరిగ్గా మ్యాచ్ అయ్యేలా బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించింది.  పుల్ ఓవర్ షర్టును నడుముకు వయ్యారంగా కట్టింది. ఒక చేతిలో సిప్పర్ బాటిల్ తో.. భుజానికి ఒక పెద్ద బ్యాగ్ ధరించి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళి కారెక్కింది.