‘హ్యాట్రిక్‌’ కేజ్రీవాల్‌!

Kejriwal

దేశ రాజధాని ప్రజలు మళ్లీ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వానికే తిరుగు లేని మెజార్టీతో పట్టంకట్టారు. దీంతో ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నారు. ఢిల్లీలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇందుకు కొంత కారణ మని చెప్పాలి. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 62 స్థానాలు ఆమ్‌ ఆద్మీపార్టీ గెలుచుకుంది. కేవలం 8 స్థానాలకు మాత్రమే బిజెపి పరిమితం కాగా 15 యేళ్లపాటు ఢిల్లీని ఏకఛ్ఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది.

ఇక ఇతరులు అన్న ప్రశ్నే లేకుండా ఢిల్లీ ప్రజలు కేవలం రెండు పార్టీలవైపే తమ ఆలోచనను పరిమితం చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపు తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో 62 సీట్లు సాధించి విజయబావుటా ఎగరేసింది. మరే ఇతర పార్టీ పైనా ప్రభుత్వం ఏర్పాటుకోసం ఆధారపడనవసరం లేకుండా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది.

మొదటి సారిగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆప్‌ కాంగ్రెస్‌ మద్దతు తో ఉన్నప్పటికీ కొద్ది నెలలకే కుప్పకూలింది. తదనం తరం ప్రకటించిన ఎన్నికల్లో 2015లో భారీ మెజార్టీతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విభిన్న మతాలు, జాతులు, దేశాలకు చెందిన ప్రజలు నివసించే దేశ రాజధాని ఢిిల్లీ ఓటర్లు ఎప్పుడూ విలక్షణ తీర్పునే ఇస్తారు.

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 7 లోక్‌సభ స్థానాలను బిజెపి గెలు చుకుంది. అదే ధీమాతో బిజెపి హైకమాండ్‌ ఈసారి ఢిల్లీలో తమదే పాగా అని ఢంకా బజాయించి మరీ చెప్పింది. ఐతే చావుతప్పి కన్నులొట్టబోయిందన్నట్లు కేవలం 8 స్థానాలతోనే బైటపడింది. పోలింగ్‌ 62.59 శాతానికి మాత్రమే పరిమితం కావడంతో విజయంపై ఆప్‌కు మరింత ధీమా పెరిగింది. గత ఎన్నికలకంటే తక్కువ పోలింగ్‌ జరిగినా రాజధాని మహానగరంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మొగ్గు చూపించారు. అంతేకాకుండా బల మైన ప్రతిపక్షం ఒకటి ఉండాలన్న సంకేతాలను ఓటర్లు బిజెపికి చూపించినట్లు ఈతీర్పు స్పష్టంచేస్తోంది.

మొత్తం 70 స్థానాల్లో 58 స్థానాలు జనరల్‌ కేటగిరీ ఐతే మరో 12 రిజర్వుడు స్థానాలుకూడా ఉన్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జెపి నడ్డా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఓటమి కావడంకూడా బిజెపి జీర్ణించుకోలేక పోతోంది. అంతేకాదు పోలింగ్‌ ముగిసిన వెనువెంటనే వెల్లడైన 7 జాతీయస్థాయి సర్వేలు ఆప్‌ ప్రభుత్వం ఏర్పా టుచేయడం ఖాయమని వెల్లడించాయి. అలాగే బిజెపి తన స్థానాలను మెరుగుపరుచుకుంటుందని చెప్పాయి.

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటిలాగే ఒకటి నుంచి మూడు స్థానాలు దక్కించుకోవచ్చని కొన్నిరాస్తే.. మరికొన్ని కాం గ్రెస్‌కు ఈసారి కూడా ఢిల్లీ ఎన్నికలు కలిసి రాకపోవచ్చని వెల్లడించాయి. ముందస్తుసర్వేలకు అనుగుణంగానే ఢిల్లీ ఓటర్లు తీర్పుచెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలుపు జన్‌కీ బాత్‌ ఢిల్లీ ప్రజల మన్‌కీబాత్‌ అని స్పష్టంచేసింది. ఆప్‌, బిజెపి, కాంగ్రెస్‌తోపాటు ఢిల్లీ ఎన్నికల్లో సుమారు పది ప్రాంతీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను పోటీకి దిం పాయి.

గెలిచే సత్తాలేకపోయినా తమ ఉనికిని చాటుకు నేందుకు ఇవి పోటీచేసినట్లు కనిపించింది. అయితే ఈ పార్టీలో 8 పార్టీల అభ్యర్థులకు లభించిన ఓట్లుచూస్తే నోటాకింద వచ్చిన ఓట్లకంటే తక్కువ ఉన్నాయి. లోక్‌జన శక్త్టి, బహుజన్‌ సమాజ్‌, ఎన్‌సిపి, జనతాదళ్‌ యునైటెడ్‌, సిపిఐ, సిపిఎం, ఆర్‌జెడి, ఆర్‌ఎల్‌డి, శివసేన, ఆలిండి యా ఫార్వర్డ్‌ బ్లాక్‌వంటి పార్టీలు ఎన్నికల్లో పోటీచేసాయి. ఈ పది పార్టీల అభ్యర్థులు కనీసం మొత్తం పోలైన ఓట్ల లో ఒకటి శాతం కూడా సాధించలేకపోయాయయని ఫలి తాలు స్పష్టంచేసాయి.

కేవలం రెండు పార్టీలుమాత్రమే అంటే బిఎస్‌పి, జెడియు మాత్రమే నోటాకంటే స్వల్పంగా అధిగమించాయి. ఇక ఢిల్లీ ఓటర్లు విలక్షణ తీర్పు చెప్పినా ప్రస్తుత రాజకీయ ధోరణులునచ్చని ప్రజలు 0.47 శాతం మందిఉన్నారని తేటతెల్లంచేసింది. ఎక్కువశాతం బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా నుంచి వలస కార్మికులు ఎక్కువగా ఢిల్లీలో ఉంటారు.

దేశం మొత్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఓటర్లు ఎక్కువే. ఈనేపథ్యంలో పౌరసత్వ సవరణచట్టం, ఎన్నా ర్సీల ప్రభావంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్థి పథకాలు అధికార పార్టీకి ఫలాలిచ్చా యి. మెట్రో రైళ్లలో మహిళలకు ఉచితప్రయాణం, ప్రతి కుటుంబానికి 20 కిలోలీటర్ల నీళ్లు, వంద యూనిట్ల వర కూ విద్యుత్‌ వినియోగం ఉచితంవంటి హామీలు విశేషం గా పనిచేసాయి.

మురికివాడల్లోని ప్రజలకు అవసరమైన సంక్షేమ హామీలు అజెండాల్లో చేర్చడంతో అవన్నీ ఓటర్ల ను ఎక్కువ ఆకర్షించాయనే చెప్పాలి. ఇక కేజ్రీవాల్‌పై అధికార బిజెపి ఉగ్రవాది అని, హిందూత్వ అజెండాను తెరపైకి తెచ్చినా కేజ్రీవాల్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి హనుమాన్‌ మందిర్‌ను సందర్శించి చాలీసాను పారాయ ణంచేసి అందరి విమర్శలను తిప్పికొట్టారు.

ఎన్నికలకు ముందే గత ఏడాది మురికివాడల్లో నివసిస్తున్న కుటుం బాలకు చెందిన అక్రమ లే ఔట్‌లను 40 లక్షల వరకూ కేంద్రం క్రమబద్ధీకరించి నోటిఫైచేసింది. తమకు ఎన్నికల్లో ఈ అంశం విశేషంగా కలిసొస్తుందని భావించినా ఎక్కడా ప్రభావం చూపించలేదుసరికదా 250మందికిపైగా ఎంపి లు, 25 మందివరకూ కేంద్రమంత్రులు ఢిల్లీ నియోజక వర్గాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగి మరీప్రచారం చే సారు. మొత్తంగాచూస్తే ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నిక లు దేశ రాజకీయాలపై తప్పక ప్రభావం చూపుతుంది

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/