కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’

15న టీజర్ రిలీజ్

keerti Suresh -Good Luck Sakhi-poster
keerti Suresh -Good Luck Sakhi-poster

‘పెంగ్విన్’ ‘మిస్ ఇండియా’ వంటి సినిమాలలో నటించిన కీర్తి ‘గుడ్ లక్ సఖి’ అనే సినిమాలోనూ నటించింది.

‘లక్ష్మి’ ‘ధనిక్’ వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న నగేష్ కుకునూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

దిల్ రాజ్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మించారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి – జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15 ఉదయం ‘గుడ్ లక్ సఖి’ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.

ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. గిరిజన యువతి వస్త్ర అలంకరణతో కాళ్ళకి కడియాలు ధరించి కీర్తి సురేష్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది.

ఈ పోస్టర్ చూస్తుంటేనే కీర్తి మరో ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తోందని అర్థం అవుతోంది.

ఇక ఈ చిత్రం తెలుగుతోపాటు మలయాళం తమిళంలోనూ విడుదల కాబోతోందని సమాచారం. 

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/