35 వచ్చినా స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు

Katrina kaif
Katrina kaif

మల్లీశ్వరి` సినిమాతో తెలుగు తెరకు సుపరిచితమైన కత్రిన ఆ తర్వాత ఇక్కడ పలు చిత్రాల్లో నటించినా ఆశించిన విజయాలు దక్కలేదు. అటుపై ఈ బ్యూటీ పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్.. రణబీర్ కపూర్ లతో కత్రిన లవ్ స్టోరీల గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం 35 వయసు వచ్చినా కత్రినలో స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం భారత్ ఈద్ కానుకగా జూన్ 5న రిలీజవుతోంది. ఆ క్రమంలోనే కత్రిన కండల హీరో సల్మాన్ తో కలిసి `భారత్` ప్రచారంలో బిజీబిజీగా ఉంది.
మీడియా చానెళ్ల ఇంటర్వ్యూల్లో కత్రిన బిజీగా గడిపేస్తోంది. మరోవైపు లేటెస్ట్ ఫోటోషూట్లను కత్రిన సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేస్తోంది. తాజాగా రివీల్ చేసిన ఫోటోలో డార్క్ మెరూన్ కలర్ షూట్ లో కత్రిన మైమరిపించింది. మిడిలేజ్ లోనూ ఈ హాట్ బ్యూటీ అందచందాలు అభిమానులకు షాకింగ్ ట్రీట్ ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోల్ని యూత్ జోరుగా వైరల్ చేస్తున్నారు. మరోవైపు కత్రిన ఓ మీడియా ఇంటర్వ్యూలో అడిగిన సర్ ప్రైజింగ్ ప్రశ్నకు ఇచ్చిన జవాబు షాక్ నిచ్చింది.