అమెరికా ప్రజాప్రతినిథి క్యాతీహిల్‌ రాజీనామా

KHYATI HIL

katie hill

వాషింగ్టన్‌: కాలిఫోర్నియా నుంచి డెమొక్రటిక్‌ అభ్యర్థిగా కొనసాగుతున్న 32 ఏళ్ల క్యాతీహిల్‌ తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దేశానికి తన నియోజకవర్గానికి, తన కమ్యూనిటీకి మంచిది కాదని చెబుతూ రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్‌లో పోస్టు చేశారు. అమెరికా ప్రజాప్రతినిధి క్యాతీహిల్‌పై పలు లైంగిక ఆరోపణలు రావడంతో హౌజ్‌ ఎథిక్స్‌ కమిటీ విచారణ చేపట్టింది. దాంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తనకు కాంగ్రెస్‌లో పనిచేసే సిబ్బందితో సంబంధం ఉందనేది నిజమయితే అతనితో ఎలాంటి శారీరక సంబంధం కానీ లైంగిక సంబంధం కాని లేదని క్యాతీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ వ్యక్తితో పరిచయం అయ్యిందని తన ప్రచారానికి అతను సహకరించాడని చెప్పారు. ఆమెపై వచ్చిన థనాల ఆధారణంగా క్యాతిని విచారణ చేస్తున్నట్లు ఎథిక్స్‌ కమిటీ వెల్లడించింది. తాను తన భర్త నుంచి విడాకులు కోసం దరఖాస్తు చేసుకున్నానని తన తప్పు ఏదైనా ఉంటే క్షమించాలని ఆమె కోరారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని క్యాతీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత ఫొటోలు బహిరంగం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె తన భర్తే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం ఉందన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/