శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోం

కర్ణాటకలో విశ్వాస పరీక్ష లేనట్లే!

supreem court
supreem court

న్యూఢిల్లీ: కర్ణాటకలో రాజీనామాలు సమర్పించిన రెబల్‌ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై కొద్దిసేపటి క్రితం సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. విశ్వాస పరీక్ష ఎప్పుడు జరపాలన్న విశేషాధికారాలతో పాటు, రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని, ఒక రాష్ట్ర శాసనసభ వ్యవహారాల్లో, అందునా స్పీకర్‌ నిర్ణయాధికారం కింద ఉన్న అంశాల్లో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం తేల్చి చెప్పింది. స్పీకర్‌ నిర్ణయం తీసుకునేంత వరకు తాము కల్పించుకోబోమని వెల్లడించడంతో కర్ణాటకం కొత్త మలుపు తిరిగినట్లయింది. కుమారస్వామికి ఊరట కలుగగా, ముందనుకున్నట్లుగా విశ్వాస పరీక్ష రేపు జరిగే అవకాశాలు లేనట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/