పొత్తు లేకుంటే కాంగ్రెస్‌కు 10 సీట్లు వచ్చేవి

sumalatha
sumalatha


బెంగళూరు: కర్ణాటకలోని రాజకీయాలు పొత్తులతో వేడెక్కిపోయిఉన్నాయి. ఈ నేపథ్యంలో మాండ్య ఎంపి సుమలత పుండు మీద కారం చల్లినట్లు కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడిఎస్‌తో పొత్తు పెట్టుకోవడమే కాంగ్రెస్‌కు చేటు కలిగించిందని ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో సుమలత ఈ వ్యాఖ్యలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో నిఖిల్‌ కుమారస్వామి ఓటమికి తన కుటుంబమే కారణమని అని సుమలత అన్నారు. జెడిఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు లేకుండా ఉంటే కనీసం 10 స్థానాల్లోనైనా గెలిచి ఉండేది. 2018 ఎన్నికలపుడు పొత్తు పెట్టుకుని ఉండాల్సింది కాదని, ఎన్నికల ముందు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఉంటే కాంగ్రెస్‌ ఘోరంగా దెబ్బతినేది. కానీ పొత్తు కారణంగానే లోక్‌సభ స్థానాల్లో బిజెపి గెలుపుకు కాంగ్రెస్‌ పరోక్షంగా మేలు చేసిందని ఆమె అన్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/