‘భారతరత్న’కు సిద్ధగంగ స్వామిజి పేరును ప్రతిపాదించండి!

kumaraswami
kumaraswami

బెంగళూరు: సిద్ధగంగ పీఠాధిపతి, లింగాయతుల ఆరాధ్య దైవం శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలని కర్ణాటక సియం కుమార స్వామి డిమాండ్‌ చేశారు. స్వామీజీకి మరణానంతర పురస్కారం ఇవ్వాలని కోరుతూ ఆయన ప్రధాని మోదికి లేఖ రాశారు. నడయాడే దేవుడిగా గుర్తింపు పందిన 111 ఏళ్ల శివకుమార స్వామి..దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా ఈ ఏడాది జనవరి 21న శివైక్యం చెందిన సంగతి తెలిసిందే.
కేవలం ఆయన ఓ మఠాధిపతిగానే కాకుండా ఓ సామాజిక వేత్తగా, మానవతావాదిగా శివకుమార స్వామి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారనీ, ఆయనను భారత రత్నకు అర్హుడిగా గుర్తించి గౌరవించాలని ప్రధానికి రాసిన లేఖలో కుమార స్వామి కోరారు. అందుకే దేశ అత్యున్నత పౌర పురస్కారం కోసం స్వామీజి పేరును ప్రతిపాదించాలని ప్రధానిని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/