క‌మ‌ల్‌హాస‌న్ పార్టీ.. తొలి జాబితా

MNM chief Kamal Haasan
MNM chief Kamal Haasan

హైద‌రాబాద్: సూప‌ర్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్‌కు చెందిన మ‌క్క‌ల్ నీధి మ‌యం(ఎంఎన్ఎం) పార్టీ .. ఇవాళ లోక‌స‌భ ఎన్నిక‌ల కోసం పోటీ ప‌డే అభ్య‌ర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. తొమ్మిది 9 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ పార్టీ త‌ర‌పున లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్న వారి లిస్టు ఇదే. బెన‌జీర్‌(క‌న్యాకుమారి), ఎంఏఎస్ సుబ్ర‌మ‌ణ్యం(పుదుచ్చ‌రి), ఆనంద రాజా(తిరుచ్చి), ర‌వి(చిదంబ‌రం), రిఫాయుద్దీన్‌(మైల‌దుద్దురై), ఎస్ రాధాకృష్ణ‌ణ్‌(తేని), ఏజీ మౌర్య‌(చెన్నై నార్త్‌), క‌మేలా న‌సీర్‌(చెన్నై సెంట్ర‌ల్‌), శివ‌కుమార్‌(శ్రీపెరంబ‌దూర్‌).