సార్వత్రిక ఎన్నికలకు నేను రెడీ!

 

KAMAL HASSAN
KAMAL HASSAN

సార్వత్రిక ఎన్నికలకు నేను రెడీ!

ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హసన్‌

మధురై: తమిళ, తెలుగు సినీనటుడు, మక్కల్‌ నీధి మయ్యూమ్‌ (ఎంఎన్‌ఎం)అధ్యక్షుడు కమలహాసన్‌ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, కాని తమిళనాడులో అంతకుముందే వచ్చే ఉప ఎన్నికలలో పోటీ చేయమన్నారు. జనరల్‌ ఎన్నికలకు పార్టీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందంటూ ప్రముఖ సినీనటుడు కమలహాసన్‌ ఒక సందర్భంలో చెప్పారు. అయితే తమ పార్టీ తమిళనాడు ఉప ఎన్నికల్లో పోటీ చేయకున్నా ప్రభుత్వానికి పాఠం నేర్పుతుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తిరువారూర్‌, తిరుపారన్‌కుంద్రం నియోజకవర్గాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఒకరు ద్రావిడ మున్నేట్ర కజగం అధ్యక్షుడు ఎం కరుణానిధి అయితే మరొకటి అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం అధ్యక్షుడు (ఎఐఎడిఎంకె)ఎకె బోస్‌. ఈ రెండు నియోజకవర్గాలకు జరగాల్సిన ఉప ఎన్నికలకు తేదీ ప్రకటించాల్సి ఉంది.