పురుచ్చతలైవిగా కాజోల్‌, శశికళగా అమలాపాల్‌!

kajol, amalapaul
kajol, amalapaul


చెన్నై: పురుచ్చతలైవి జీవిత నేపథ్యంలో ది ఐరన్‌ లేడి పేరుతో జయలలిత బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. తమిళ దర్శకురాలైన ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. ఇందులో నిత్యామీనన్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుంది. ఇక తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి శశి లలిత పేరుతో జయలలిత జీవిత నేపథ్యంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఏం జరిగింది అనేది ఇందులో చూపించబోతున్నారు. ఐతే ఈ చిత్రంలో జయలలితగా కాజోల్‌ నటించనుండగా, శశికళగా అమలాపాల్‌ని ఎంపిక చేశారని సమాచారం.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/