కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా

Jyotiraditya Scindia
Jyotiraditya Scindia

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి జ్యోతిరాదిత్య షాక్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఈరోజు ఉదయం మోడిని కలిసిన అనంతరం సింధియా తన రాజీనామా లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈనేపథ్యంలో ఆయన తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా ఉన్న తాను ఇప్పుడు పార్టీని వీడాల్సిన సమయం వచ్చిందని ఆ లేఖలో సింధియా పేర్కొన్నారు. రాష్ట్రానికి, దేశానికి సేవలందించాలన్నదే మొదట్నించీ తన కోరక అని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పని చేయలేకపోతున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే మరోసారి కొత్తగా తమ పయనం ప్రారంభించాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ఇంతవరకూ తనకు సహకరించిన పార్టీ సహచరులు, కార్యకర్తలకు ధన్యవాదాలని సోనియాగాంధీకి పంపిన లేఖలో సింధియా పేర్కొన్నారు. కాగా మరికొద్ది సేపట్లో సింధియా బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆపార్టీలో చేరనున్నట్లు సమాచారం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/