విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్

Vijay Mallya-Supreme Court
Vijay Mallya-Supreme Court

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న మాల్యా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించకపోవడాన్ని తప్పుబట్టింది. మాల్యాకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇదివరకే స్వాధీనం చేసుకుంది. వీటిని బ్యాంకులకు అప్పగించడం ద్వారా మాల్యా చెల్లించాల్సిన సొమ్మను ఈడీ రాబట్టుకోవచ్చంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. కేసును విచారణ సందర్భంగా.. మాల్యా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. మాల్యాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, సీనియర్ న్యాయవాది అయిన పాలీ నారిమన్ గతంలో విజయ్ మాల్యా తరపున వాదించారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/